Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కేసు (Deepfake Case) దర్యాప్తులో నలుగురు నిందితుల్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) తాజాగా తెలిపారు.
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు (Delhi Cops) విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు (Deepfake Case) దర్యాప్తులో నలుగురు నిందితుల్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) తాజాగా తెలిపారు. ఆ నలుగురే ఈ వీడియోను అప్లోడ్ చేసినట్టు గుర్తించామన్నారు.
అయితే, నకిలీ వీడియో తయారు చేసింది మాత్రం వీరు కాదని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్‌ఫేక్ వీడియోని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నకిలీ వీడియోను సృష్టించిన అసలు నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. మెటా సంస్థ అందించిన వివరాల ఆధారంగా నలుగురు నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Coronavirus | కొవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
Coronavirus | కొత్తగా 341 కరోనా కేసులు.. మూడు మరణాలు.. అత్యధికంగా కేరళలోనే
Sonia Gandhi | ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు.. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

