కమెడీయన్‌గా, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ అనే సినిమా రూపొందుతుంది.తమిళంలో వచ్చిన ఒత్తు సెరుప్పు సైజ్ 7 అనే చిత్రానికి రీమేక్‌గా మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకట్ చంద్ర. ఈ సినిమాను యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలు పెంచాయి.
తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. పూరీ జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్లో డేగల బాబ్జీ అనే వ్యక్తిగా బండ్ల గణేశ్ నటన ఆద్యంతం కట్టుకునేలా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని పండిస్తూ ఆయన పలికించిన హావభావాలు మెప్పించేలా ఉన్నాయి. ‘‘పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం’’, ‘‘అస్సలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా’’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో కథ తాలూకు మెయిన్ అంశాలను ఎలివేట్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. అలాగే ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ చుట్టూనే తిరిగింది. మీరు ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.