Deepthi jeevanji | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ వచ్చి సందడి చేసింది. తమిళ స్టార్ నటుడు సూర్య కూడా వచ్చి సందడి చేశాడు. కానీ దీనికి సంబంధించిన ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ షోకి చీఫ్ గెస్ట్‌గా ఒలింపిక్ మెడలిస్ట్ వచ్చింది. ఇటీవల పారిస్ పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన పారా అథ్లెట్ దీప్తి జివాంజి. అన్‌స్టాపబుల్ సీజన్ 4కి వచ్చి సందడి చేసింది.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో దీప్తి కాంస్య పతకంతో సత్తా చాటింది. 400 మీటర్ల టీ- 20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ ముద్దాడింది. ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ ఎపిసోడ్‌లోనే దీప్తి జివాంజి రాగా.. దీప్తి సాధించిన బ్రాంజ్ మెడల్‌ను బాలయ్య ఆమె మెడలో వేశారు. అనంతరం ఈసారి గోల్డ్ మెడల్ సాధించాలంటూ విషెస్ తెలిపాడు. అలాగే దీప్తి జివాంజికి అన్‌స్టాపబుల్ స్పాన్సర్ల తరపున రూ. 1,50,000 చెక్ అందించారు. మరోవైపు దీప్తి పట్టుదలకు ముగ్థుడైన నిర్మాత నాగవంశీ కూడా ఆమెకి రూ.50000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపాడు.