బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే కొన్నేళ్ల క్రితం రణ్వీర్ సింగ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ చాలా సాఫీగా నడుస్తుంది. అయితే దీపిక గర్భవతి అంటూ ఓ వర్గం జోరుగా ప్రచారం జరుపుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. రణవీర్ సింగ్ -దీపికా పదుకొణె శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. రణవీర్ – దీపిక ఇద్దరూ స్టైలిష్ క్యాజువల్స్ ధరించి సింపుల్ గా కనిపించారు. మాస్కులు కూడా ధరించారు.
ఈ సమయంలో వారిద్దరు ఆసుపత్రి ముందు ప్రత్యక్షం అయ్యే సరికి అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు దీపిక గర్భవతి అంటుంటే మరి కొందరు ఏదైన అనారోగ్యంతో ఆసుప్రతికి వెళ్లిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో పూర్తి క్లారిటీ రావాలంటే వారి నుండి రెస్పాన్స్ రాక తప్పదు.
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న దీపిక పదుకొణే ఓ వైపు కథానాయికగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలకు పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ -కె లో అలాగే అల్లు రామాయణం-ట్రయాలజీ
లోనూ దీపిక నటించనుంది. దాదాపు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వీరిలో చేతిలో ఉండగా, దీపిక గర్భవతి అయితే వాటి పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.