Simbu | చాలా కాలం తర్వాత శింబు మానాడుతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. అయితే అదే జోష్‌ను శింబు తర్వాతి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’, ‘పత్తు తాలా’ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ ప్లాపుల బాట పడ్డాడు. కాగా ఫలితం ఎలా ఉన్న శింబు మాత్రం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన కన్నులు కన్నులు దోచాయంటే ఫేమ్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో శింబుకు జోడీగా దీపికా పదుకొణెను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పొజీషన్లో ఉన్న దీపికా.. శింబుతో కలిసి నటించడానికి ఓకే చెబుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. ఆయన అడిగితే కాదనని వారుంటారా? అని కూడా నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. శింబు కంటే దీపికా పదుకొణె రెమ్యునరేషనే ఎక్కువ. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక దీపికా తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన కొచ్చాడియాన్ సినిమాతో తొలిసారిగా తమిళ సినిమా చేసింది.