Deepika Padukone – Ranveer Singh | బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నటి దీపికా పదుకొణె (Deepika Padukone) నేడు ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇక రణవీర్ సింగ్, దీపికా పదుకొణె పేరెంట్స్ అవ్వడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘రామ్ లీలా’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రామ్ లీలా తర్వాత, బాజీరావు మస్తానీ (Bajirao Mastani) పద్మావత్ (Padmaavat) సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలకు కూడా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడం విశేషం.