ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone) లీడ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
నేడు దీపికా పదుకొనేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రాజెక్ట్ కే లుక్ విడుదల చేశారు మేకర్స్. చీకట్లో ఆశ.. అంటూ పోస్టర్‌పై క్యాప్షన్ ఇచ్చారు. ఎత్తైన కొండపై ఉన్న దీపికా పదుకొనే బ్యాక్ డ్రాప్లో సూర్య కాంతి పడుతుండగా.. బ్లాక్ షేడ్స్ లో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ స్టన్నింగ్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమా ఎంత ఎక్జయిటింగ్‌గా ఉండబోతుందో ఈ ఒక్క స్టిల్‌తో అర్థమవుతోంది.
దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న పఠాన్ జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా చేస్తున్నాడు. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కేజీఎఫ్ ప్రాంఛైజీ, కాంతార లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023