Deepika Padukone | బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణే ఈ మధ్య వివాదాలతో వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందనున్న స్పిరిట్ మూవీలో దీపికాని హీరోయిన్గా అనుకున్నాడు సందీప్. కథ కూడా చెప్పాడట. కాని కండీషన్స్‌కి చిర్రెత్తుకొచ్చిన సందీప్ రెడ్డి వంగా కథానాయికగా యానిమల్ భామ తృప్తి దిమ్రిని ఫైనల్ చేసాడు. అందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. అయితే తన ప్రాజెక్ట్ నుండి దీపికాని తప్పించడంతో కథ అంతా లీక్ చేసిందని దీపికాపై ఆగ్రహం వ్యక్తం చేసాడు సందీప్ రెడ్డి వంగా. ఇక దీపిక కూడా తగ్గేదే లే అన్నట్టు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
ఇక స్పిరిట్ నుండి తప్పుకున్న దీపికా పదుకొణే .. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న సినిమాకి సైన్ చేసిందనే టాక్ నడిచింది. దీనిపై క్లారిటీ అయితే లేదు. ఇక దీపిక ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన కల్కి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక కల్కి 2లో కూడా దీపికా నటించాల్సి ఉండగా, ఈ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుందని జోరుగా ప్రచారం సాగుతుంది. తల్లి అయిన తర్వాత ఆమె తక్కువ పని గంటలు పని చేస్తానని డిమాండ్ చేయడం.. 8 గంటల వర్క్, ఎక్స్ ట్రా షూటింగ్ చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ అంటూ కొన్ని కండీషన్స్ పెట్టడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.
ఈ క్రమంలో కల్కి 2 నుండి కూడా దీపికని తప్పించారనే వార్తలు బీటౌన్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని దీపికా పీఆర్ టీమ్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. కల్కి 2 కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుంది. పైగా దీపికా పాత్ర సెకండ్ పార్ట్ లో చాలా కీలకం కాగా, తనను తప్పించి వేరే వారిని తీసుకునే ఆలోచన కల్కి టీమ్ అయితే చేయకపోవచ్చు. అలాగే తప్పుకోవాలన్న ఆలోచనా దీపికాకు లేదు. సో.. దీపికా పదుకోణే కల్కి 2 నుంచి తప్పుకుంది అనే వార్తలు ఇప్పటికైతే పూర్తిగా నిరాధారం అని చెప్పాలి.