Kalki 2- Deepika Padukone | Kalki 2- Deepika Padukone | టాలీవుడ్ నుంచి రాబోయే ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌లలో కల్కి 2 ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా.. దీపికా పదుకొనే, దిశా పటాని కథానాయికలుగా నటించారు. కమల్ హాసన్ విలన్‌గా నటించగా.. అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్‌ను చిత్రబృందం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తప్పుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే భాగం అవ్వట్లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ పార్ట్నర్షిప్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి సినిమాలకు నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్‌లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ వైజయంతీ మూవీస్ రాసుకోచ్చింది.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025