ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో కథానాయిక ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. రోజుకో పేరు తెరపైకొస్తున్నది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం కానుందని ఇటీవలకాలంలో ప్రచారం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో దీపికా పడుకోన్ నాయికగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ మధ్యే ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందని ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ చిత్రంలో దీపికా పడుకోన్నే నాయికగా అనుకున్నారని, అయితే డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేక ఆమె వదులుకుందని తెలిసింది.
ఇప్పుడు సినిమా షూట్ ఆలస్యమయ్యే పరిస్థితి ఉండటంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త షెడ్యూల్‌తో దీపికాను కలిశారట. అక్టోబర్ నుంచి తనకు వేరే సినిమాల కమిట్మెంట్స్ ఏమీ లేకపోవడంతో దీపికా పడుకోన్ వెంటనే సమ్మతించిందని తెలిసింది. ‘స్పిరిట్’ చిత్ర కథాంశంతో పాటు తన పాత్రను తీర్చిదిద్దిన విధానం దీపికాను బాగా ఇంప్రెస్ చేసిందని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు
నిర్మించనున్నాయి.