Deepika Padukone | బాలీవుడ్లో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు రణ్‌వీర్‌సింగ్-దీపికా పడుకోన్. పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌పరంగా కూడా ఈ దంపతులు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే వీరి వైవాహిక బంధంపై గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోనున్నారని ముంబై మీడియాలో కథనాలొచ్చాయి.
కొద్ది నెలల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించింది దీపికా పడుకోన్. రణ్వీర్తో తాను ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నానని చెప్పింది. అయినా ఈ స్టార్‌కపుల్ విడాకులపై రూమర్స్ ఆగడం లేదు. వీటన్నింటికి చెక్ పెడుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది దీపికా పడుకోన్. ఇందులో భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ఆనందంగా పడవలో విహరిస్తూ కనిపిస్తుందామె. రణ్‌వీర్‌సింగ్ సైతం ఇదే ఫొటోను తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. విడాకుల వదంతులకు చెక్ పెట్టేందుకే ఈ దంపతులిద్దరూ ఈ ఫొటోను షేర్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీపికా ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తున్నది.