ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన తన తండ్రి ప్రకాశ్ పదుకొనే 70వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది అగ్ర కథానాయిక దీపికా పదుకొనే. ఈ సందర్భంగా ఆయనకు ఓ అద్భుతమైన బహుమతిని అందించింది. పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ మరో శాఖను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు తెలిపింది. ‘బ్యాడ్మింటన్ క్రీడ మన శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎంతలా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నా.
అందుకే పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్‌ను ప్రారంభించాం. ఈ సంస్థ ద్వారా క్రమశిక్షణతో కూడిన బ్యాడ్మింటన్ క్రీడలో శిక్షణనిస్తున్నాం. ఈ వయసులో కూడా నాన్న బ్యాడ్మింటన్‌ను ప్రాణంగా ప్రేమిస్తారు. అదే ఆయనకు ప్రపంచం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్ అనే లక్ష్యంతో నాన్నకు కానుకగా ఈ బ్రాంచీని ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని దీపికా పదుకొనే ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పటికేపలు నగరాల్లో పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ బ్రాంచీలు ఉన్నాయి. దీపికా పదుకోన్ తెలుగులో ఇటీవలే అల్లు అర్జున్-అట్లీ చిత్రానికి ఓకే చెప్పింది.