ప్రభాస్ సినిమాల జోరు పెంచుతున్నారు. రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). సైన్స్ ఫిక్షన్ అంశాలకు ప్రేమకథను జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్‌లోకి శనివారం ప్రభాస్ అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో ప్రభాస్, దీపికాపడుకోన్లపై కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ చేతిని దీపిక ఆత్మీయంగా అందుకుంటున్న వీడియోను చిత్రబృందం పోస్ట్ చేసింది. అర్రీ అలెక్సా 65 కెమెరా టెక్నాలజీతో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. వెనమ్, ఎటర్నల్స్ లాంటి హాలీవుడ్ సూపర్‌హీరో చిత్రాలను ఈ కెమెరాతోనే తెరకెక్కించడం విశేషం. అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నది.