Singham-3 | లేడీ సింగంగా దీపికా పదుకొనే.. వీర లెవల్లో ఫస్ట్‌లుక్ పోస్టర్.!
Singham-3 | బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో దీపికా పదుకొనే ఒకరు. దశాబ్ధన్నర కాలానికి పైగా బాలీవుడ్‌ను ఏలుతూ వస్తుంది. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో దీపిక జోడీ కట్టింది. కేవలం ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.
Singham-3 | బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో దీపికా పదుకొనే ఒకరు. దశాబ్ధన్నర కాలానికి పైగా బాలీవుడ్‌ను ఏలుతూ వస్తుంది. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో దీపిక జోడీ కట్టింది. కేవలం ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో దీపికాది అగ్రస్థానం. ఇక ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో సింగం ఎగైన్ ఒకటి. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. ఇక ఈ సినిమాలో దీపికా లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ గతంలోనే రివీల్ చేశారు.
తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రైడీ నోట్లో గన్ను పెట్టి నవ్వుతూ ఉన్న ఫస్ట్‌లుక్ దీపిక ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. రౌడీ మూకలను మట్టుకరిపించానన్న గర్వం దీపిక కళ్లలో ఉట్టిపడుతుంది. ఫస్ట్లుక్కే ఈ రేంజ్లో ఉంటుందో సినిమాలో దీపిక క్యారెక్టర్‌ను ఏ రేంజ్లో రోహిత్ శెట్టి డిజైన్ చేసి ఉంటాడో అని అప్పుడే దీపిక ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. ఇక ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత దీపికా దాదాపు 9ఏళ్ళకు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సినిమా చేస్తుంది. ఇక ఈ మూడో ఇన్స్టాల్మెంట్లో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
DEEPIKA PADUKONE AS LADY SINGHAM: ROHIT SHETTY UNVEILS FEROCIOUS LOOK… #RohitShetty expands the cop universe as he welcomes #DeepikaPadukone – the first female cop #LadySingham – in the highly anticipated #SinghamAgain.#SinghamAgain is the third part in #RohitShetty’s… pic.twitter.com/fEkVCvXAJP
— taran adarsh (@taran_adarsh) October 15, 2023
పుష్కర కాలం కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

