నారా రోహిత్ 20వ సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘సుందరకాండ’. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం ఈ సినిమా నుంచి ‘డియర్ ఐరా..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని రాసిన ఈ ప్రేమ గీతాన్ని లియోన్ జేమ్స్ స్వరపరచి, కీర్తన వైద్యనాథన్‌తో కలిసి ఆలపించారు. నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం.వర్మ, నిర్మాణం: సందీప్ పిక్చర్ ప్యాలెస్.