రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్మెన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హాలీవుడ్ మూవీ ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’. మార్వెల్ స్టూడియోస్ పతాకంపై షాన్ లెవీ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ఇప్పుడు ఆ క్రేజ్‌ని మరింత పెంచుతూ ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. గత ట్రైలర్స్ మాదిరిగానే ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’తో పాటు మరికొందరు సూపర్‌హీరోలు కూడా ఈ సినిమాలో ఉన్నారని ట్రైలర్ చెబుతున్నది. ఈ ట్రైలర్లో లేడీ డెడ్ పుల్, అలాగే వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్‌పుల్, వాల్వరిన్ల యాక్షన్ సీక్వెన్స్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు.