Captain Miller | టాలెంటెడ్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆ సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్ 30న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ సోషల్ మీడిఆ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు.
మరో రెండో రోజుల్లో ఫస్ట్ లుక్ రానుండటంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తిగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూడు పార్టులుగా రాబోతుందని తెలుస్తోండగా.. దీనిపై ధనుష్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్రలో నటిస్తుండగా.. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
The most awaited #CaptainMiller First Look on JUNE 30 , 2023 🥁🔥@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @dhilipaction @siddnunidop pic.twitter.com/XXPvoA2ku1
— Sathya Jyothi Films (@SathyaJyothi) June 27, 2023