Dasara Movie Collections | ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి ‘దసరా’ అలాంటి విజయాన్నే అందించింది. గురువారం విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్, నాని నటనకు ప్రేక్షకులు వెర్రెత్తి పోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లో సీట్లలో ఒక్కరు కూడా కూర్చొలేదు. దర్శకుడిగా శ్రీకాంత్‌కు తొలి సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌కు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్గా కీర్తి, కీలకపాత్రలో దీక్షిత్ శెట్టి ఇరగదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ఫ్యాన్స్‌కు ఇటు ప్రేక్షకులకు ధమ్ బిర్యానీ పెట్టేశాడు నాని.
రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తొలి రోజు రికార్డు కలెక్షన్లను నమోదయ్యాయి. నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా దసరా నిలిచింది. తొలిరోజే అనుకుంటే రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది. రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి బాక్సాఫీస్ దగ్గర నాని విజయ ఢంకా మొగించాడు. ఇక మూడో రోజు కూడా ఇదే ఊపు కొనసాగింది. మూడో రోజు దసరా రూ.18 కోట్లు కొల్లగొట్టింది. రోజు రోజుకు ఈ సినిమాపై విపరీతమైన ఆధరణ పెరుగుతుంది. ఇక ఆదివారం రోజు అడ్వా్న్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ ఉన్నాయట. ఆదివారంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పైగా దసరాకు పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కాలేవు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని కల్ట్ క్రేజ్ ఈ ఒక్క సినిమాతో నాని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నాని నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమా నాని కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు. అంతేకాకుండా ఇది నానికి తొలి వంద కోట్ల బొమ్మ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చే వారం రావణాసుర వరకు ఈ సినిమాకు పోటీ లేదు. యూఎస్‌లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తుంది. ఇప్పటికే 1మిలియన్ మార్కుకు చేరువలోకి వచ్చింది.
Dharani’s swag all the way 🔥🔥
71+ CRORES WORLDWIDE GROSS IN 3 DAYS 💥💥
Watch #Dasara in cinemas today 💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/d01UncJsFF— SLV Cinemas (@SLVCinemasOffl) April 2, 2023