Das Ka Dhamki Movie | విశ్వక్సేన్ ఊరమాస్.. డివైడ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్లా?
Das Ka Dhamki Movie Collections | నాలుగేళ్ల కిందట వచ్చిన 'ఫలక్నూమా దాస్'తో దర్శకుడి అవతారమెత్తిన విశ్వక్.. తొలి సినిమాతోనే విషయం ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.
Das Ka Dhamki Movie Collections | నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ఫలక్నూమా దాస్’తో దర్శకుడి అవతారమెత్తిన విశ్వక్.. తొలి సినిమాతోనే విషయం ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. కమర్షియల్గానూ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటుడిగా తెగ బిజీ అయిపోయాడు. ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ కెరీర్ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. కాగా మళ్లీ నాలుగేళ్లకు మెగాఫోన్ పట్టి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాను రూపొందించాడు. ఈ సారి కాస్త ఎక్కువే రిస్క్ చేసి డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా తెరకెక్కించాడు.

నాలుగు నెలల కింద రిలీజ్ చేసిన ట్రైలర్తో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇక మూడు నెలల కింద విడుదలైన ఆల్ మోస్ట్ పడిపోయానే పిల్లా పాట ప్రతీ చెవిలో మోగిపోయింది. ఇలా రిలీజ్కు ముందే సినిమాపై తిరగులేని బజ్ ఏర్పడింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కు తారక్ రావడంతో సినిమాపై బజ్ అమాంతం పెరిగింది. తీరా రిలీజయ్యాకు సినిమా బెడిసి కొట్టింది. నటుడుగా డిస్టింక్షన్ సాధించిన విశ్వక్.. దర్శకుడిగా కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకున్నాడని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

అయితే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లలో మాత్రం విశ్వక్ సంచలనం సృష్టించాడు. అప్పటివరకు తనకున్న మార్కెట్కు రెండింతలు కలెక్షన్లు సాధించి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కావలిసినంత యాక్షన్, నివేదా గ్లామర్ ప్రదర్శన మాస్ ఆడియోన్స్ను కట్టిపడేసింది. దాంతో తొలి రోజు నుంచే ఔరా అనిపించే కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకపోతుంది. అది కూడా అన్ సీజన్ అయినటువంటి మార్చిలో. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు రూ.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

డివైడ్ టాక్తో ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం అంటే మాములు విషయం కాదు. దీంతో టాలీవుడ్లో విశ్వక్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో విశ్వక్ మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం విశ్వక్ హీరోగా రెండు సినిమాలకు సైన్ చేశాడు. ఇక దాస్ కా ధమ్కీ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనున్నట్లు విశ్వక్ తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

