Extra Ordinary Man | టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) టైటిల్ ఫిక్స్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమోను విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ ఇస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం డేంజర్ పిల్లా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో హర్ట్ టచింగ్ మెలోడీగా సాగుతున్న ఈ పాటను కే కృష్ణకాంత్ రాశాడు. అర్మాన్ మాలిక్ ఈ పాట పాడాడు. శేఖర్ వీజే పాటకు నృత్యరీతులు సమకూర్చాడు.
ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నితిన్ గుబురు గడ్డంతో ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ పెంచుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనుడగా.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. నితిన్ దీంతోపాటు వెంకీ కుడుముల (Venky Kudumula) డైరెక్షన్లో VNRTrio (వర్కింగ్ టైటిల్) కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ ముగ్గురి కలయికలో వచ్చిన భీష్మ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్ రెండో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. VNRTrio చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..