Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తిరుపతి మురళి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు
Chiranjeevi | తిరుపతికి చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయారు. మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసిన డ్యాన్స్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Chiranjeevi | తిరుపతికి చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయారు. మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసిన డ్యాన్స్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ వీడియోలు వైరల్ కావడంతో మురళి ‘ఢీ’ షో వేదికపై కూడా కనిపించారు. అక్కడ ఆయన చేసిన ఎనర్జీటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను, జడ్జీలను అలరించింది. దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో మురళి మరోసారి తన స్టెప్స్‌తో మెప్పించగా, ఆ ఈవెంట్‌కు నాగబాబు గెస్ట్‌గా హాజరయ్యారు. మురళి ప్రదర్శన చూసి ఆయన ఫిదా అయ్యారు. చిరంజీవి అభిమాని అయిన మురళికి “నీ కలను నిజం చేస్తా… నిన్ను స్వయంగా చిరంజీవి గారిని కలిపిస్తా” అని నాగబాబు ఇచ్చిన మాట మురళిని ఎమోషనల్ చేసింది.
తాజాగా నాగబాబు తన మాట నిలబెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ సమయంలో మురళిని కలిపించి, అతనితో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భం మురళికి జీవితంలో మరచిపోలేని క్షణంగా నిలిచిపోయింది.‘ఢీ’ షోలో ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ చూపించగా, మురళి చిరంజీవిని చూసి “మీరు లేనిదే నేను లేను సర్… ఇక చనిపోయినా పర్లేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మురళికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. “ఒక రోజు నా సినిమాలో నా పక్కన డ్యాన్స్ వేస్తావు” అని హామీ ఇచ్చారట. ఈ మాటతో మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సంఘటనపై అభిమానులు, నెటిజన్లు చిరంజీవి దయ, నాగబాబు హృదయం, మురళి ప్యాషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సాధారణ అభిమాని కలను నెరవేర్చిన ఈ సంఘటన ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ప్రస్తుతం చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుండగా, విశ్వంభర చిత్రం సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

