Daiji Movie | ఈ మధ్య కన్నడ సినిమాలు సృష్టిస్తున్న భీభత్సాలు అంతా ఇంతా కాదు. ఒకప్పుడు డబ్బింగ్ రూపంలో రిలీజైన సినిమాలను కూడా అంతగా పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు కన్నడ సినిమాలొస్తే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘కేజీఎఫ్ సిరీస్’, ‘కాంతార’, ‘చార్లీ777’ వంటి పలు సినిమాలు కన్నడ పరిశ్రమ రూపు రేఖల్ని మార్చేశాయి. ఇక ఈ ఇండస్ట్రీ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే అందరూ తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా అలాంటి అంచనాలతోనే తెరకెక్కుతున్న మరో సినిమా ‘డైజీ’. కన్నడ స్టార్ నటుడు రమేష్ అరవింద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఆకాష్ శ్రీవత్సవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా నటుడు రమేష్ అరవింద్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో రానున్నట్లు తెలుస్తుంది. పోస్టర్లో రమేష్ మొహాన్ని పలు రంగులతో కప్పేసి చెవికి కమ్మలు పెట్టుకుని చాలా యూనిక్‌గా ఉన్నాడు. అదే విధంగా పోస్టర్ కాస్త థ్రిల్లింగ్‌గా డిజైన్ చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. ఇక రమేష్ 106వ సినిమాగా తెరకెక్కుతున్న డైజీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. విభా ప్రొడక్షన్ బ్యానర్‌పై రవి కశ్యప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
రమేష్ అరవింద్ కన్నడలో గత నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నాడు. కన్నడలో మోస్ట్ వర్సటైల్ యాక్టర్లలో ఆయన ఒకడు. తెలుగులోనూ రమేష్ అరవింద్ రుద్రవీణ, పరమశివుడు, లిటిల్ సోల్జర్స్ వంటి పలు సినిమాల్లో మెరిసాడు. ఇక ఆదివారంతో ఆయన 59వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ బర్త్‌డే విషెస్‌ను తెలియ జేస్తున్నారు.
RAMESH ARAVIND’S 106TH FILM ‘DAIJI’ FIRST LOOK POSTER UNVEILS… On #RameshAravind’s birthday today, the makers of #Daiji unveil the #FirstLook poster of the #Kannada film.#AkashSrivatsa – director of #ShivajiSurathkal series – directs #Daiji… Produced by entrepreneur… pic.twitter.com/gLUK8Avmls
— taran adarsh (@taran_adarsh) September 10, 2023