Champion Trailer | ఆసక్తి రేపుతున్న రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ రిలీజ్.. స్పోర్ట్స్ డ్రామా పై భారీ అంచనాలు
Champion Trailer |టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుంచి మరో సర్ప్రైజ్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు
Champion Trailer |టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుంచి మరో సర్ప్రైజ్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ట్రైలర్‌ను చూస్తే, బ్రిటీష్ కాలం తర్వాత నిజాం పాలన సాగుతున్న హైదరాబాద్ నేపథ్యాన్ని బలంగా చూపించారు. ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ మేకా కనిపించబోతున్నారు.
“భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా… హైదరాబాద్‌లో మాత్రం నిజాం పాలన కింద నలిగిపోతూ నవాబులకు సలాం కొట్టాల్సిందే” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవడం వెంటనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైరాన్‌పల్లి గ్రామంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, ఆ ఊరిలో ఓ యువకుడు ఫుట్‌బాల్ ఛాంపియన్ కావాలనే కలతో ముందుకు సాగడం కథగా కనిపిస్తోంది. తమ ఊరిపై జరిగిన దాడులను గ్రామస్థులు ఎలా ఎదుర్కొన్నారు? ఫుట్‌బాల్ ఛాంపియన్ కావాలని ఆశించే ఆ యువకుడు నిజాం దాడులను ఎలా తట్టుకున్నాడు? అసలు నిజాం పాలనకు, స్పోర్ట్స్‌కు ఉన్న లింక్ ఏమిటి? అనే అంశాలు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే టీజర్లో ‘లగాన్’ తరహా వైబ్స్ ఇచ్చిన ఈ సినిమా, ట్రైలర్‌తో అంతకు పదింతలు హైప్‌ను క్రియేట్ చేసింది.
ఈ మూవీలో రోషన్ మేకా సరసన అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా, ఒకప్పటి స్టార్ హీరో నందమూరి కల్యాణ్ కీలక పాత్రలో రాజి రెడ్డిగా కనిపించనున్నారు. అర్చన మరో ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన క్యారెక్టర్ లుక్స్‌కు మంచి స్పందన లభించగా, లవ్ సాంగ్ ‘గిరగిరగిర గింగిరా గిరే’ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘ఛాంపియన్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

