నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 15వ ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఆనందం వ్యక్తం చేశారు.
నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నయన్ సారిక, తన్వీ రామ్ ఇందులో కథానాయికలు. కర్మసిద్ధాంతం నేపథ్యంలో సాగే ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయాన్ని సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది.