Dacoit | ‘డెకాయిట్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. తొలి రోజే రూ.13.57 కోట్లు వసూళ్లు రాబట్టిందా..!
Dacoit | కంటెంట్ ఆధారిత కథలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లలో మంచి ప్రదర్శన కనబరిచింది.
Dacoit | కంటెంట్ ఆధారిత కథలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లలో మంచి ప్రదర్శన కనబరిచింది. ప్రేమకథ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించగా, మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. విడుదలైన మొదటి రోజే దేశీయ, విదేశీ మార్కెట్లలో గణనీయమైన వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
ఇండియా బాక్సాఫీస్‌లో ‘డెకాయిట్’కు మంచి ఓపెనింగ్ లభించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా బలమైన కలెక్షన్లు సాధించింది. తెలుగు వెర్షన్ ద్వారా రూ.5.60 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. అయితే హిందీ మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. హిందీ వెర్షన్‌కు సుమారు రూ.90 లక్షల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇండియాలో తొలి రోజు నెట్ కలెక్షన్లు రూ.6.50 కోట్లు కాగా, గ్రాస్ కలెక్షన్లు రూ.7.57 కోట్లు నమోదయ్యాయి. ఇక దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లో కూడా ‘డెకాయిట్’ మంచి స్పందనను అందుకుంది. ఓవర్సీస్లో ఈ చిత్రం తొలి రోజే రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ.13.57 కోట్లకు చేరుకుంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు చూస్తే.. తెలుగు నెట్ (ఇండియా): రూ. 5.60 కోట్లు, హిందీ నెట్ (ఇండియా): రూ. 90 లక్షలు, ఇండియా నెట్ మొత్తం: రూ. 6.50 కోట్లు, ఇండియా గ్రాస్: రూ. 7.57 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్: రూ. 6.00 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ. 13.57 కోట్లు వసూళ్లు సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్, జాన్ కొకెన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని భీమ్స్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను గ్యాని రూపొందించారు. మిక్స్డ్ టాక్ మధ్య విడుదలైన ‘డెకాయిట్’కు వచ్చిన ఈ ఓపెనింగ్ కలెక్షన్లు, సినిమా తర్వాతి రోజుల్లో మరింత బలంగా నిలబడే అవకాశాలను సూచిస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే, ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లో మరో సక్సెస్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

