‘సప్తసాగరాలు దాటి’ వంటి హృద్యమైన ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హేమంత్ రావు. ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. డాలీ ధనుంజయ, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులు. జె. ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ నిర్మిస్తున్నారు. శుక్రవారం డాలీ ధనుంజయ్ న్యూలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన డాలీ ధనుంజయ్..‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.