బాలకృష్ణ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా
‘డాకు మహారాజ్' రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నా. బాలయ్యగారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టే సినిమా తీశాం.
‘డాకు మహారాజ్’ రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నా. బాలయ్యగారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టే సినిమా తీశాం. ఇందులో అయిదు యాక్షన్ సీక్వెన్సులుంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు హై ఇస్తుంది. వినోదంతోపాటు, హత్తుకునే ఎమోషన్స్ కూడా ఇందులో ఉంటాయి.’ అని దర్శకుడు బాబీ కొల్లి అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు బాబీ మాట్లాడారు. ‘ ‘డాకు మహారాజ్’ను రెండు తెలుగు రాష్ర్టాల్లో కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లోనూ భారీస్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ కూడా బావున్నాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ నెల 12నే సినిమా విడుదల కానుంది. సినిమా చూసి చెబుతున్నా.. ‘డాకు మహారాజ్’ అస్సలు నిరాశ పరచదు’ అని నిర్మాత నాగవంశీ నమ్మకం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

