ఆయన నమ్మకం నిజమైంది
‘బాలకృష్ణగారి కెరీర్‌లోని గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్' నిలుస్తుందని గతంలో ఓ ప్రెస్‌మీట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన ఈ సినిమాను అంత నమ్మారు. ఈరోజు ఆయన నమ్మకం నిజమైంది. ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో హిట్ అందుకున్నా.
‘బాలకృష్ణగారి కెరీర్‌లోని గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఓ ప్రెస్‌మీట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన ఈ సినిమాను అంత నమ్మారు. ఈరోజు ఆయన నమ్మకం నిజమైంది. ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో హిట్ అందుకున్నా. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చా. సంక్రాంతి నాకు ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ సంగీతం, విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రధాన బలాలు. బాలకృష్ణగారి తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ వీరిద్దరే.
మనసుపెట్టి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని ‘డాకు మహారాజ్’తో రుజువైంది.’ అని దర్శకుడు బాబీ కొల్లి అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఆదివారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నదని టీమ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ వారం అనంతపూరంలో సక్సెస్‌మీట్ నిర్వహించనున్నామని, అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

