Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసముంటున్న ప్రముఖ సినీ నటి గోగినేని అనిత సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసముంటున్న ప్రముఖ సినీ నటి గోగినేని అనిత సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ట్రావెల్ ఏజెంట్ కోసం అన్వేషించారు.
ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరుతో ఓ సైబర్ కేటుగాడు ఆమెను సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని నమ్మబలికాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి డెబిట్ కార్డు వివరాలు తెలపాలని కోరగా, నిజమైన ట్రావెల్ ఏజెంటేనని నమ్మిన నటి అనిత తన డెబిట్ కార్డు వివరాలను అందజేశారు. ఆ తర్వాత బుకింగ్ కోసం అడిగిన ఓటీపీ (OTP) నంబర్‌ను సైతం ఆమె వెల్లడించారు.
కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ‘క్లియర్ ట్రిప్’ (Cleartrip) పేరిట రూ.4,14,180 నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే, డబ్బులు కట్ అయినప్పటికీ ఎంతకీ టికెట్ బుకింగ్ వివరాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన నటి అనిత.. తాను మోసపోయానని గ్రహించారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో విమాన టికెట్లు లేదా ఇతర సేవలు బుక్ చేసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను ఎవరికీ తెలపవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
Munipalli | స్నానం చేస్తేనే పాఠశాలకు రావాలి..! నేను ఇంతే, నా మాటే శాసనం
Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

