Custody| టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న తాజా చిత్రం కస్టడీ (Custody). యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా టైమ్‌లెస్ లవ్ (Timeless Love) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ పాడారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ టీజ్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కస్టడీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. కస్టడీలో నాగచైతన్య పోలీసాఫీసర్ శివగా కనిపించబోతున్నాడు. కస్టడీ ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కస్టీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కస్టడీ మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బంగార్రాజు తర్వాత కృతిశెట్టి, నాగచైతన్య కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం.
Timeless Love లిరికల్ వీడియో సాంగ్..
Feel the Vintage Vibrant Melody Magic along with @chay_akkineni & @IamKrithiShetty!🕺💃
Here’s the #TimelessLove lyrical❤️
Tel: https://t.co/HWTsTRlx0l
Tam: https://t.co/qNGjmkUBIv🎤 @KapilKapilan_
✍️ @ramjowrites, @madhankarky
🕺 @Sekharmasteroff #CustodyOnMay12 pic.twitter.com/Q1yhlXKTA3— Srinivasaa Silver Screen (@SS_Screens) April 23, 2023
హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్..
స్టడీ గ్లింప్స్ వీడియో..
నాగచైతన్య కస్టడీ టీజర్ టీజ్..
కస్టడీ టీజర్..
Read Also :
Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్
Sarath Babu | శరత్‌బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్
Vishal 34 | విశాల్ 34 లాంఛ్.. ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్