Skanda Movie | కమర్షియల్ సినిమా అంటే అందులో పక్కా ఓ ఊరమాస్ సాంగ్ ఉండాల్సిందే. అది ఎప్పుటి నుంచో వస్తున్న ఆనవాయితి. దానికి తగ్గట్లే ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు సైతం థియేటర్లు దద్దరిల్లే రేంజ్లో ఓ మాస్ సాంగ్‌ను ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా సుకుమార్, బోయపాటి సినిమాల్లో మాస్ పాటలకు సెపరేట్ ఫ్యాన్సే ఉంటారు. తాజాగా అలాంటి మరో బీట్‌ను ప్లాన్ చేశాడు బోయపాటి శ్రీను. కల్ట్ మామా అంటూ రెండు రోజుల కిందట ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కాగా తాజాగా వినాయక చవితి సందర్భంగా లిరికల్ పాటను రిలీజ్ చేశారు.
థమన్ స్వర పరిచిన ఈ మాస్ గీతాన్ని.. హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇక రామ్ పోతినేని ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఊపేశాడు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ ఐటెం గర్ల్ ఊర్వశి రౌటెలా నర్తించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ స్పెషల్ సాంగ్ కూడా ఆ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరుతుందని మేకర్స్ తెలుపుతున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా నార్త్‌లో మంచి హైప్‌తో రిలీజవుతుంది. ఇక అదే రోజున చంద్రముఖి-2 కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకైతే ఈ సీక్వెల్‌పై జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. దానికి తోడు ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హార్రర్ జోనర్ కాబట్టి ప్రేక్షకులు కాస్త కనెక్ట్ అయినా బంపర్ హిట్టు చేసేస్తారు.