Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
Husharu 2 Teaser | టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సంచలన విజయం సాధించిన చిత్రం ‘హుషారు’ (2018). సున్నితమైన హాస్యం, స్నేహం మరియు యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘హుషారు 2’ (Husharu 2) వస్తోంది.
Husharu 2 Teaser | టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సంచలన విజయం సాధించిన చిత్రం ‘హుషారు’ (2018). సున్నితమైన హాస్యం, స్నేహం మరియు యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘హుషారు 2’ (Husharu 2) వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. మొదటి భాగాన్ని మించిన వినోదం, డబుల్ మ్యాడ్నెస్ మరియు ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
చిత్రగుంజ్ నేపథ్యంలో కథ.. ‘బాయ్స్ ఆర్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో మొదలయ్యే ఈ టీజర్లో, రాహుల్ రామకృష్ణ తన గ్యాంగ్‌తో కలిసి ఒక క్రేజీ ఐడియాను నిజం చేసుకోవడం కోసం ‘చిత్రగుంజ్’ ప్రాంతానికి వెళ్లడం చూపించారు. అడవి నేపథ్యంలో సాగే ఈ ప్రయాణంలో విలన్ల నుంచి తప్పించుకునే క్రమంలో కథ ఎన్నో ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ టీజర్లో అందరికంటే ప్రధాన ఆకర్షణ, హైలైట్ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఎంట్రీ. సాధారణంగా కమర్షియల్ చిత్రాలకు, ప్రత్యేక పాత్రలకు దూరంగా ఉండే ఆయన.. ఈ యూత్‌ఫుల్ సినిమాలో సాయుధ నక్సలైట్ నాయకుడిగా కనిపించి అందరినీ విపరీతంగా ఆశ్చర్యపరిచారు. టీజర్ చివరిలో ఆయన చెప్పే “తమ్ముళ్లూ వేట మొదలెడదామా!” అనే పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మొదటి భాగంలో ‘కబూమ్’ బీర్ తయారీ చుట్టూ సరదా సన్నివేశాలు నడిస్తే, ఈ సీక్వెల్లో ‘టేకిలా’ బిజినెస్ మరియు అడవి నేపథ్యంలో సాగే యాక్షన్, కామెడీ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. రాహుల్ రామకృష్ణ తనదైన శైలి సెటైర్లు, కామెడీ టైమింగ్‌తో టీజర్‌ను మరింత నవ్వులు పూయించేలా మార్చారు.
ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్ కొచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

