Adivi Sesh | ‘ఈ రోజు ఉదయం హీరో మహేష్‌బాబు ఫోన్ చేశాడు. చాలా కాలం గ్యాప్ తరువాత ఆయనతో ఫోన్లో మాట్లాడాను. హిట్-2 సినిమా విజయంపై శుభాకాంక్షలు అందజేశాడు. నా పట్ల ఆయనకున్న అభిమానం, ప్రేమ, ఆయన మాటలు వింటే నాకు కన్నీళు ఆగలేదు’ అన్నారు అడవిశేష్. ఆయన తాజా చిత్రం ‘హిట్-2’కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి ప్రారంభ వసూళ్లు కూడా రావడంతో అడవిశేష్లో మంచి జోష్ కనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఆయనను నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సోషల్‌మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. మహేష్‌కు ఒక సోదరుడిగా ఆయన ఎప్పుడూ తోడు వుంటానని ఆయన మాటిచ్చానని, ఆయన నా విషయంలో గర్వంగా వున్నానని చెప్పడం గర్వంగా వుందని ఈ సందర్భంగా చెప్పారు మహేష్‌బాబు. త్వరలో హిట్-2 చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నామని, హైదరాబాద్‌లో మొదలైన హిట్ కథ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకుల హృదయాలను చేరువ కాబోతుందని తెలిపారు అడవి శేష్.