టినూ ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమృద్ధి అర్యల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మాచికంటి దర్శకుడు. వేణు దోనేపూడి నిర్మాత. అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదని, ఆరుగురి మధ్య ఒక రోజులో జరిగే కథగా ఈ సినిమా రూపొందుతున్నదని, ఇది అందమైన ప్రకృతి నేపథ్యంలో సాగే కథ అని, ఎల్లప్పుడూ వర్షం కురుస్తూ ఉండే చిరపుంజీలో షూటింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయమే అయినా, ఇష్టంతో సమస్యలన్నింటినీ అధిగమిస్తూ చిత్రీకరణ జరుపుతున్నామని, రికార్డు టైమ్లో సినిమాను పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకులకు అందిస్తామని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు.