వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ట్యాక్సీ’. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిత సజ్జా నిర్మిస్తున్నారు. హరీష్ సజ్జా దర్శకుడు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. కృత్తిమంగా తయారు చేసిన కాలిఫోర్నియం 252 అనే ఖనిజం నేపథ్యంగా ఈ సినిమా సాగనుంది. ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి, సంగీతం : మార్క్ కె రాబిన్.