Vaishnavi Chaitanya | హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించిన చిత్రం బేబి (Baby). ఈ చిత్రంలో టైటిల్ రోల్లో మెరిసి సూపర్ క్రేజ్ సంపాదించింది విజయవాడ సుందరి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). బేబి ప్రాజెక్ట్‌లో తన పాత్రలో జీవించేసి.. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టరే స్వయంగా తనను సహజనటి జయసుధతో పోల్చే స్థాయికి చేరుకొని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
బేబి వైష్ణవి చైతన్య కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బేబి సినిమాతో అగ్రదర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చి చేరాయన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం వైష్ణవి చైతన్య మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూడు సినిమాలు యువ హీరోలతో చేయనుండగా.. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్ నడుస్తోంది. బేబి ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వైష్ణవి చైతన్య మరి నెక్ట్స్ ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకొస్తుందనేది చూడాలంటున్నారు మూవీ లవర్స్.
బేబి ట్రైలర్..