NTR 31 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవర షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన దేవర లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే తారక్ ఇప్పటికే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (PrashanthNeel) డైరెక్షన్లో సినిమాకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ 31 (NTR 31)గా రాబోతుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సలార్, దేవర షూటింగ్స్ పూర్తయిన తర్వాత తారక్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరువబోతుందన్న వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ఇప్పటికే తారక్ నటిస్తోన్న దేవరలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. నెక్ట్స్ పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతున్న ఎన్టీఆర్ 31లో మరో బీటౌన్ బ్యూటీ కనిపించనుందన్న అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో ఇంట్రెస్టింగ్గా మారింది.
సిటడెల్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినా అక్కడ అంత పాపులారిటీ సంపాదించుకోలేకపోయిన ప్రియాంక.. మళ్లీ భారతీయ (ప్రధానంగా బాలీవుడ్) సినిమాల్లో అవకాశం కోసం చూస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లేమి రావడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకా చోప్రా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31లో నటిస్తే మాత్రం సక్సెస్‌ఫుల్‌గా హోం ఇండస్ట్రీ (బాలీవుడ్)కి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టార్‌డమ్‌ను కూడా పదిలంగా కాపాడుకోవచ్చని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సత్తా చాటుతుండటంతో ఇటీవల కాలంలో బాలీవుడ్ యాక్టర్లు తెలుగులో సినిమాలు చేసేందుక ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కుదిరి ఎన్టీఆర్ 31కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ప్రియాంకా చోప్రాకు మాత్రం కెరీర్ బూస్ట్ సినిమా అవుతుందనడటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.