‘క్రేజీఫెలో’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఫణికృష్ణ సిరికి. శ్రీసత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ జంటగా నటించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణికృష్ణ సిరికి మాట్లాడుతూ ‘పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. యాడ్స్‌తో పాటు కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ చేశా. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే కథతో ‘క్రేజీఫెలో’ను తెరకెక్కించాం. చెప్పిన మాటను పూర్తిగా వినకపోతే వచ్చే సమస్యల్ని వినోదాత్మకంగా చూపెట్టాం. ఎంటర్‌టైన్‌తో పాటు ఎమోషన్ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చిరునవ్వులతో బయటికొస్తారు. ఆది పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఆయన నటనలోని కొత్త కోణాన్ని చూస్తారు. ఇందులో ఆయనే హీరో, విలన్ కూడా. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా మంచి కంటెంట్‌తో వచ్చే సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘క్రేజీఫెలో’ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.