Bro Movie Latest Update | ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఉన్నంత ఖుషీగా ఏ హీరో అభిమాని లేడేమో. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో పవన్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని బ్రో సినిమాకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో తిరుగులేని హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో దింపితే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం మేకర్స్ అన్నపూర్ణ స్డూడీయోస్లో ఓ కాస్ట్లీ పబ్ సెట్‌ను నిర్మించబోతున్నారట. ఇప్పటివరకు టాలీవుడ్ సినీ చరిత్రలోనే అంత కాస్ట్లీ పబ్ సెట్ నిర్మించలేదట. దీని కోసం పీపుల్ మీడియా సంస్థ కోట్లు ఖర్చుపెడుతుంది. ఇక ఈ సెట్లో ఓ కీలక సన్నివేశం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.