Coolie | సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి మరో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రీట్‌గా ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తొలిసారిగా నెగెటివ్ రోల్లో కనిపించగా, శృతిహాసన్, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ హైప్ తీసుకువచ్చింది.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్టు 14 నాటి నుంచి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో సందడి చేస్తోంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రదర్శితమైన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. #CoolieReview, #CoolieFDFS అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్ మొత్తం ఊపేస్తోంది.మోనికా పాటకు థియేటర్ మొత్తం ఊగిపోతుంది! గూస్ బంప్స్ గ్యారంటీ!” – అంటూ ఓ నెటిజన్ హర్షం వ్యక్తం చేశారు. “నాగార్జున ఎంట్రీ అదిరింది. సైమన్ పాత్రలో మాస్ ప్రెజెన్స్ చూపించారు అని తమిళ ఓవర్సీస్ ప్రేక్షకుడు తెలిపారు.టైటిల్ కార్డు డిజైన్, రజినీకాంత్ ఎంట్రీ, అనిరుధ్ బీజీఎం, చికిటు సాంగ్ అన్నీ బ్లాక్‌బస్టర్ ఫీల్స్ ఇచ్చాయి అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
కొంతమంది మాత్రం ఈ సినిమా తన అంచనాలను తలకిందులు చేసిందని ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగింది. కామెడీ చాలా పేలవంగా ఉంది. సీన్లు ముందే ఊహించవచ్చు అని ఒకరు విమర్శించారు. సెకండాఫ్ లో ఫోర్స్డ్ డ్రామా, ఓవర్ యాక్షన్, క్లైమాక్స్ మాత్రం చీదరించుకునేలా ఉంది. మొత్తం మీద నిరాశే మిగిలింది అని మరో నెటిజన్ స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాని చూసేందకు అభిమానులు బ్లాక్‌లో వేలు ఖర్చు చేసి టిక్కెట్స్ కొంటున్నారు. కొంతమంది ఈ సినిమాను రజినీ వన్ మ్యాన్ షో అని పొగిడేస్తున్నారు. నాగార్జున విలన్‌గా గూస్బంప్స్ తెప్పించారు, ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్లో అదరగొట్టాడు. అనిరుధ్ బీజీఎం నెక్ట్స్ లెవెల్. లోకేష్ డైరెక్షన్ శబాష్ ఎలాంటి మైనస్ లేవు అంటూ ఒకరు 4/5 రేటింగ్ ఇవ్వడం విశేషం. మరొకరు కూలీ 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే తొలి తమిళ చిత్రం అవుతుంది అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద ‘కూలీ’ పై మిక్స్డ్ రివ్యూలు ఉన్నప్పటికీ, రజినీకాంత్ మాస్ అప్పీల్, నాగార్జున విలన్ పాత్ర, అనిరుధ్ మ్యూజిక్, పాన్ ఇండియా కాస్టింగ్ సినిమాకు బలంగా నిలిచాయి. మరి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.