Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఈసినిమా కథ విషయానికి వస్తే.. సైమన్(అక్కినేని నాగార్జున) పేరు మోసిన స్మగ్లర్. ఓ షిప్యార్డ్ని అడ్డాగా చేసుకొని తన కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. స్మగ్ల్గూడ్స్, బంగారం ఇల్లీగల్‌గా ఎగుమతీ, దిగుమతులు అతని వృత్తి. అతని అనుంగు అనుచరుడు దయాళ్(సౌబిన్ షాహిర్). సైమన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఇతని కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. మహాక్రూరుడు. ఇదిలావుంటే.. మరణించిన జంతువుల క్రిమేషన్ కోసం రాజశేఖర్(సత్యరాజ్) ఓ ఎలక్ట్రిక్ ఛైర్‌ని తయారు చేస్తాడు. ఇలాంటి ఛైర్ కారణంగా మంచితోపాటు చెడు కూడా జరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ప్రతినిథులు అభిప్రాయపడతారు. దాంతో ఆ ఛైర్‌ని మార్కెట్లోకి తెచ్చేందుకు గవర్నమెంట్ పర్మిషన్ రాదు. తన శ్రమంతా వృధా అయిపోతుందనుకొని రాజశేఖర్ బాధ పడుతున్న సమయంలో అతనికి సైమన్ నుంచి కబురు వస్తుంది. తాను చంపిన శవాలను బూడిద చేసేందుకు ఆ ఛైర్ కావాలంటాడు సైమన్. సహకరించపోతే కూతుళ్లను చంపుతానని బెదిరిస్తాడు. దాంతో కుటుంబం కోసం తప్పక సైమన్‌తో చేయి కలుపుతాడు రాజశేఖర్. సైమన్ చంపిన శవాలను ఆ కుర్చీ సహాయంతో బూడిద చేస్తుంటాడు. తన కుమార్తె ప్రీతి(శ్రుతిహాసన్) రాజశేఖర్‌కు ఈ విషయంలో సహాయం చేస్తుంటుంది. ఇదిలావుంటే.. ఉన్నట్టుండి రాజశేఖర్ మరణిస్తాడు. ఆ మరణవార్త విన్న రాజశేఖర్ ప్రాణస్నేహితుడు దేవా(రజనీకాంత్) షాక్ అవుతాడు. రాజశేఖర్‌ది సహజ మరణం కాదని, అతన్ని కొట్టి చంపారని దేవాకు తెలుస్తుంది. అంతేకాక, రాజశేఖర్ కుమార్తెలు ముగ్గురూ కూడా ప్రమాదంలో ఉన్నారని దేవాకు తెలుస్తుంది. దాంతో తన స్నేహితుడి పిల్లలకు దేవా అండగా నిలుస్తాడు. అసలు రాజశేఖర్‌ని చంపిందెవరు? రాజశేఖర్ పిల్లల్ని దేవా ఎలా కాపాడాడు? అసలు ఈ దేవా ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
get ready to vibe with the saga of Deva, Simon, and Dahaa 🔥#CoolieOnPrime, Sep 11@rajinikanth @sunpictures @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja pic.twitter.com/Erjtef2o0C
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025