Coolie Event in Hyderabad | అగ్ర కథానాయకుడు రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అగ్ర నటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా హైదరాబాద్ వేదికగా మూడో పాటను వదలనుంది. అయితే ఈ వేడుకలో పాల్గోనడానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ హైదరాబాద్‌కి వచ్చారు. వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
LokeshKanagaraj & Anirudh arrived Hyderabad for today’s #Coolie song launch event ♥️🔥pic.twitter.com/N32afLhwwx
— AmuthaBharathi (@CinemaWithAB) July 22, 2025