Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ” (Coolie) థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 11, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. బాక్సాఫీస్ వద్ద మాస్ ఆడియన్స్‌కు పండగలా మారిన “కూలీ” ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతోంది. సినిమాను థియేటర్లలో మిస్ చేసిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్‌కి ఇది గొప్ప అవకాశం.
ఓటీటీ విడుదలకు ఒక రోజు ముందు, సెప్టెంబర్ 10న చిత్రబృందం “కూలీ” అసలైన సంగీతాన్ని (OST) యూట్యూబ్ సహా అన్ని ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేశారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను ఎంతగా మాయ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లుదు చిత్రంలోని ప్రముఖమైన OST ట్రాక్స్ ఏంటంటే.. I Am the Danger, చికిటు, మాబ్స్టా, మోనికా.. ఈ పాటలతో పాటు, చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయడంతో, OSTపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. తాజాగా విడుదలైన ఓఎస్టీ వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది.
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్స్ ప్రెజెన్స్, పవర్ఫుల్ కథనంతో కూడిన యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. సినిమా థియేటర్లలో హిట్టయిన తర్వాత, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతున్న “కూలీ” ఫ్యాన్స్‌కి పండుగలా మారనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు. మరోవైపు OST రిలీజ్‌తో సినిమాపై మళ్లీ హైప్ పెరిగింది.