Coolie Release announcement | తలైవా రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా ఇది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్ర నటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఇదే రోజున బాలీవుడ్ నుంచి మరో అగ్ర సినిమా రాబోతుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా ఆగష్టు 14నే విడుదల కాబోతుంది. రెండు పాన్ ఇండియా సినిమాలు అలాగే భారీ అంచనాలు కూడా ఈ రెండు సినిమాలకు ఉండడంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కూలీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. వార్ 2 దేశభక్తి నేపథ్యంలో రాబోతుంది.