Coolie | సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘కూలీ’. ఈ సినిమా విడుదలైన తొలి రోజే ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పటికే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాకు ఓవర్సీస్లో మంచి స్పందన లభిస్తుంది. ప్రత్యేకంగా కెనడా మార్కెట్లో ‘కూలీ ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. రజినీ సత్తా ఏంటో మరోసారి నిరూపణ అయ్యింది. ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో అక్కడ అదనపు షోలు కూడా వేస్తున్నారు.
దీనికి తోడు, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా కెనడా, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో వీకెండ్ స్పెషల్ ప్రీమియర్లతో మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమాపై టాక్ ఎలా ఉన్నా, తలైవర్ ఫ్యాన్ బేస్ మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా రజినీ సినిమాకు ఆడియన్స్ క్యూలు కడుతున్నారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, పాటలు ఇప్పటికే యూట్యూబ్ మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. నేపథ్య సంగీతం కూడా థియేటర్ అనుభూతికి మరింత హై ఎనర్జీ జోడిస్తోంది.
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విజువల్స్, స్టన్ సీక్వెన్సులు, స్టార్ పవర్ ద్వారా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. లోకేష్ కనగరాజ్ మార్క్ డైరెక్షన్ కూడా సినిమాకు ప్రధాన బలం అనే చెప్పాలి. సూపర్ స్టార్ రజినీ స్టామినా మరోసారి ఓవర్సీస్లో చాటి చెప్పిన ఈ చిత్రం, వచ్చే వారాంతంలో ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి. చిత్రంలో రజనీకాంత్ దేవాగా కనిపించారు. గోల్డ్ స్మగ్లర్ పాత్రను పోషించి ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు.నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించారు.