Singeetam Srinivasa Rao | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నేటి తరం యువ దర్శకులకు, భవిష్యత్ ఫిల్మ్ మేకర్స్‌కు అత్యంత విలువైన సందేశాన్ని అందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన ఇప్పుడున్న యువ దర్శకులకు వారి మీదా వారికి నమ్మకం లేదని తెలిపాడు. ఒక యువ దర్శకుడు నా దగ్గరికి వచ్చి తన కథను చదవమని చెప్పాడు. అందులో నేను తప్పు ఉంది అతడు కూడా తప్పులు ఉన్నాయని అంటున్నాడు. నేను బాగుంది అంటే బాగుంది అంటున్నాడు. ఇది కాదు దర్శకుడు అంటే. ఇలాంటి వారు అసలు ఫిల్మ్ మేకర్‌గా పనికిరారు.
ఒక ఫిల్మ్ మేకర్‌కి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం తన ఆలోచనపై తనకు ఉండే అచంచలమైన నమ్మకం (Conviction) అని ఆయన స్పష్టం చేశారు. సినిమా రంగంలో అడుగుపెట్టే వారు పదిమంది మాటలకు ప్రభావితం కాకుండా, తమ విజన్ పట్ల స్పష్టతతో ఉండాలని ఆయన సూచించారు. ఆదిత్య 369, పుష్పక విమానం లాంటి సినిమాలు తీసినంతా మాత్రాన నేను ఏం చెప్పిన గుడ్డిగా ఫాలో అవ్వోద్దని తెలిపాడు.
ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా నిరంతర విద్యార్థిగా ఉంటూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న సింగీతం, యువత ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. సినిమా అంటే కేవలం ఫార్ములాలు మాత్రమే కాదని, బడ్జెట్ కంటే క్రియేటివిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే ఉత్సాహంతో ఆయన తన 61వ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ అశ్విన్ నిర్మాణంలో ప్రారంభించబోతుండటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రానున్న ఈ చిత్రం ద్వారా, వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, నూతనోత్సాహంతో అడుగులు వేయాలని ఆయన మరోసారి నిరూపిస్తూ అప్‌కమింగ్ మేకర్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Upcoming film makers కి సింగీతం గారు చెప్పిన గొప్ప సలహా 👌
Have your convictions !! pic.twitter.com/yOtf44hSdK
— Rajesh Manne (@rajeshmanne1) April 30, 2026