టాలీవుడ్ యువ దంపతులు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇటు దక్షిణాదితో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. విడాకుల అంశంపై ఇరువురి సన్నిహితులతో పాటు సినీతారలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు సోషల్‌మీడియాలో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. విడాకులకు దారితీసిన పరిస్థితుల గురించి నాగచైతన్య, సమంత ఇప్పటివరకు ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ తారలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వైరల్‌గా మారుతున్నాయి.
ప్రేమొక్కటే సరిపోదు-చిన్మయి శ్రీపాద
తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, సమంతల మధ్య చక్కటి స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. చిన్మయి తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పరోక్షంగా సమంతకు మద్దతు ప్రకటిస్తూ పెళ్లి గురించి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘పెళ్లి చేసుకునే ముందు పిల్లల్ని పెంచిన విధానం, ఆస్తులుఅప్పులు, కుటుంబంతో వ్యవహరించే పద్దతి, చిన్నతనంలోని భయాలు, అభద్రతా భావాలు, మతపరమైన విశ్వాసాలు, ఆర్థికపరమైన ఆశలు, అంచనాలు, మానసిక ఆరోగ్యం, సొంత ఇంటి కలలు, కెరీర్‌పరమైన ఆకాంక్షలు, రాజకీయ దృష్టికోణాలు…ఈ విషయాలన్నింటి గురించి చర్చించండి. ఎందుకంటే కేవలం ప్రేమను కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు’ అని చిన్మయి పేర్కొంది.
బాలీవుడ్ సూపర్‌స్టారే కారణం-కంగనారనౌత్
నిత్యం వివాదాల సహవాసిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నాయిక కంగనారనౌత్ నాగచైతన్య, సమంతల విడాకులపై స్పందించింది. ‘పది సంవత్సరాల ప్రేమ, నాలుగేళ్ల వైవాహిక బంధం కలిగిన యువహీరో ఇటీవల విడాకుల నిపుణుడైన బాలీవుడ్ అగ్రహీరోను కలిశాడు. ఆయన డైరెక్షన్లోనే ఈ వ్యవహారమంతా జరిగింది. ఆ పెద్దహీరో ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది’ అని కంగనా పేర్కొంది. మరో పోస్ట్‌లో విడాకుల గురించి కంగనా మాట్లాడుతూ ‘విడాకులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు పురుషులదే తప్పుంటుంది. దేవుడు స్త్రీపురుషులకు సంబంధించిన ఆలోచనాధోరణుల్ని భిన్నంగా తీర్చిదిద్దాడు. సైన్స్‌పరంగా చూసినా పురుషులు వేటగాళ్ల మనస్తత్వంతో కనిపిస్తారు. మహిళలు సంరక్షకులుగా ఉంటారు. దుస్తులు మార్చుకున్నంత సులభంగా మహిళల్ని ఏమార్చుతూ మిత్రులుగా నటించేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మహిళలు కూడా తప్పు చేయొచ్చు..కానీ అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు’ అని కంగనారనౌత్ పేర్కొంది.
రహస్యం బంధాన్ని చెరిపివేస్తుంది
సమంత వ్యక్తిగత ైస్టెలిష్ట్గా వ్యవహరిస్తున్న ప్రీతమ్ జుకల్కర్ పెట్టిన పోస్ట్‌లు కూడా సోషల్‌మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే రహస్యాలు, అబద్ధాలు ఇద్దరి మధ్య ఉన్న బంధాలను చెరిపివేస్తాయి’ అని వ్యాఖ్యానించిన ప్రీతమ్.. ఆ తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. సమంత విడాకులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.