త్రిగుణ, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జగన్మోహన్, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు కథలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. షాయాజీషిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్మంత్ర, దర్శకత్వం: మల్లి యేలూరి.