Yadamma Raju Wedding | ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మార్మోగిపోతున్నాయి. నయనతార, నాగశౌర్య, హన్సిక వంటి పలువురు సెలబ్రెటీలు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా వీరి బాటలోనే కమేడియన్ యాదమ్మ రాజు చేరాడు. ‘పటాస్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు.
యాదమ్మ రాజు, స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుక బిగ్బాస్ సెలబ్రెటీలతో నిండి ఉంది. ఇక టాలీవుడ్లో పలు సెలబ్రెటీలు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. నాగబాబు, ఆకాష్ పూరీ, అశ్విన్ బాబు, యాంకర్ ప్రదీప్ వంటి పలువురు వివాహా వేడకకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.