Kriti Sanon | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ కృతి సనన్ (Kriti Sanon). మహేశ్ బాబు, నాగచైతన్య వంటి లీడింగ్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. కృతి సనన్ ప్రస్తుతం కాక్టెయిల్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మోడ్రన్ లవ్, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో తన పాత్ర తన కెరీర్లో ఇప్పటివరకు పోషించనివిధంగా చాలా హాటెస్ట్ అండ్ బోల్డ్‌గా సాగుతుందని చెబుతోంది కృతిసనన్. అంతేకాదు తన రోల్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయమంటోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా, కృతిసనన్ పార్ట్‌నర్స్‌గా కనిపించబోతుండగా.. ఈ కాంబో కథనాన్ని ఆసక్తికరంగా సాగేలా చేస్తుందట.
తాజా టాక్ ప్రకారం ఈ ఇద్దరు ఫీ మేల్ స్టార్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బోల్డ్‌గా ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ అందించడం పక్కా అయిపోయినట్టే. హోమి అడంజనియా డైరెక్ట్ చేస్తున్న కాక్టెయిల్ 2 థీమ్, ప్రజెంటేషన్ చాలా బోల్డ్‌గా ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ సమాచారం. డేరింగ్ స్టోరీ లైన్, స్టన్నింగ్ కాంబోలో వస్తున్న రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
Munugode | మునుగోడు నీళ్ల విషయంలో అన్యాయంపై ఎమ్మెల్యే మౌనం వీడాలి : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
Australia | ఎర్రగా మారిన ఆకాశం.. ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన
TVK Vijay | రెండు స్థానాల నుంచి బరిలోకి టీవీకే చీఫ్ విజయ్